యంగ్ యాక్ట్రెస్ కు కరోనా పాజిటివ్

nikki galrani tested positive for covid 19

ఇప్పటికే ఎంతో మంచి సినీ సెలబ్రిటీస్ కు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే కదా. రోజుకో సెలబ్రిటీ కరోనా బారిన పడుతున్నారు. బండ్ల గణేష్ మొదలుకుని, రాజమౌళి ఫ్యామిలీ, స్మిత, ఎస్.పి. బాలు ఇలా టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వైరస్ సోకిన వారిలో ఉన్నారు. రెండు రోజుల క్రితమే ఆర్‌ఎక్స్‌ 100 డైరెక్టర్ అజయ్ భూపతికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇప్పుడు తాజాగా మరో యంగ్ యాక్ట్రెస్ కు కూడా కరోనా సోకింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు నిక్కీ గర్లాని. ఈ విషయాన్ని స్వయంగా తానే ట్విట్టర్ ద్వారా తెలిపింది. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది.. ప్రస్తుతం కోలుకుంటున్నాను అని తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతే కాదు కరోనా నేపథ్యంలో అందరికీ తమ ఆరోగ్యంతో పాటు పక్కవారు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. నా ఏజ్, హెల్త్ దృష్ట్యా కరోనా నుంచి కోలుకుంటున్నాననే నమ్మకం తనకు ఉంది. అదే కుటుంబంలో పెద్దలకు వస్తే మాత్రం ఆందోళన చెందాల్సిన విషయమే. ఒక రకంగా కరోనా కారణంగా అందరికీ శుచి,శుభ్రత అలవాటైందని తెలిపింది నిక్కీ గర్లానీ. కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరింది. అదే సమయంలో భౌతిక దూరం కూడా పాటించాలని కోరింది.

 

సినీ నటి సంజన చెల్లెలుగా సినీ రంగ ప్రవేశం చేసింది నిక్కీ గర్లానీ. మలయాళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన నిక్కీ గర్లానీ తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో పలు భాషల్లో సినిమాలు చేసింది. సునీల్ హీరోగా తెరకెక్కిన ‘కృష్ణాష్టమి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆది పినిశెట్టి హీరోగా నటించిన బై లింగ్వల్ ‘మలుపు’ లో నటించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.