కీర్తి సురేష్ :బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకున్న సూపర్ హిట్ “నేను శైలజ ” మూవీ తో కీర్తి సురేష్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కీర్తి నటించిన “నేను లోకల్ ” మూవీ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తెలుగు , తమిళ , మలయాళ మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి , దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ “మహానటి ” మూవీ లో సావిత్రి పాత్రలో జీవించారు. ఈ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. కీర్తి ప్రస్తుతం “మిస్ ఇండియా “, గుడ్ లక్ సఖి “, “రంగ్ దే” , “అన్నా త్తే “(తమిళ ), “మరక్కార్ “(మలయాళ ) మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పూజాహెగ్డే : సక్సెస్ ఫుల్ “ఒక లైలా కోసం “మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన పూజాహెగ్డే “దువ్వాడ జగన్నాథం “, “అరవింద సమేత వీర రాఘవ “, “మహర్షి”, “గద్దలకొండ గణేష్ “, “అల.. వైకుంఠపురములో .. ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో పూజాహెగ్డే ప్రేక్షకులను అలరించారు. పూజాహెగ్డే ప్రస్తుతం “రాధే శ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ , అక్షయ్ కుమార్ బాలీవుడ్ మూవీస్ లో హీరోయిన్ గా పూజాహెగ్డే ఎంపిక అయ్యారు.
రష్మిక :కన్నడ సూపర్ హిట్ చిత్ర హీరోయిన్ కన్నడ బ్యూటీ రష్మిక బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. “గీత గోవిందం”, “సరిలేరు నీకెవ్వరు””భీష్మ ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన “పొగరు “కన్నడ మూవీ తెలుగు భాషలో కూడా రిలీజ్ కానుంది. తమిళ హీరో కార్తీ , రష్మిక జంటగా రూపొందిన “సుల్తాన్ ” మూవీ తో రష్మిక కోలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
సాయి పల్లవి : సక్సెస్ ఫుల్ మలయాళ మూవీస్ లో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ఫిదా” మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. ఆ మూవీ లో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సాయి పల్లవి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ను అందుకున్నారు. తెలుగు , తమిళ , మళయాళ సక్సెస్ ఫుల్ చిత్రాలలో నటించిన సాయి పల్లవి నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “లవ్ స్టోరీ “, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న “విరాటపర్వం ” మూవీస్ లో నటిస్తున్నారు.
[totalpoll id=”47443″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: