పోల్ గేమ్ : సూపర్ స్టార్ మహేష్ బాబు బెస్ట్ మూవీ ?

Poll Game: Which One Is Your Favourite Mahesh Babu Movie Among These?

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సూపర్ హిట్ “రాజకుమారుడు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. మహేష్ బాబు అభిమానులలో మహిళాభిమానులు కూడా అధిక శాతంలో ఉండడం విశేషం. వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నారు. మహేష్ బాబు కు బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ , మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ తో ఒక పోల్ గేమ్ నిర్వహిస్తున్నాం. మీకు నచ్చిన , మీరు మెచ్చిన మూవీ కి ఓటు చేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక్కడు :సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఒక్కడు ” మూవీ ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 8 నంది , 4 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది. ఈ మూవీ కై భారీ ఖర్చుతో చార్మినార్ సెట్ ను రూపొందించడం విశేషం.

పోకిరి :ఇందిర ప్రొడక్షన్స్ , వైష్ణో అకాడమీ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “పోకిరి ” రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు డైలాగ్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ మూవీ 4 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది.

దూకుడు :14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా , భారీ తారాగణం తో రూపొందిన యాక్షన్ , కామెడీ ఎంటర్ టైనర్ “దూకుడు “మూవీ ఘనవిజయం సాధించి ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ 7 నంది , 6 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు , వెంకటేష్ హీరోలుగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు” మూవీ ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు క్యాజువల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ 4 నంది , 2 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకుంది.

శ్రీమంతుడు : జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్ , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ “శ్రీమంతుడు “మూవీ ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఈ మూవీ 3 ఫిల్మ్ ఫేర్, 6 ఐఫా, 6 సైమా అవార్డ్స్ అందుకుంది. ఈ మూవీ స్ఫూర్తి తో పలువురు ప్రముఖులు వెనుక బడిన గ్రామాలను దత్తత తీసుకొనడం విశేషం.

భరత్ అనే నేను : డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందిన పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భరత్ అనే నేను” మూవీ ఘనవిజయం సాధించింది. రాజకీయాలపై అవగాహన లేని యువకుడు ముఖ్య మంత్రి గా మారి వ్యవస్థలో మార్పు తీసుకొనిరావడం నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ 2 జీ సినీ అవార్డ్స్ , 4 రేడియో సిటీ అవార్డ్స్ అందుకుంది.

మహర్షి : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , వైజయంతీ మూవీస్ , పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరో గా ప్రస్తుతం రైతు సమస్యలు , ఆత్మహత్యలు , వాటిన నివారణకు చర్యలు నేపథ్యంలో రూపొందిన “మహర్షి “మూవీ ఘనవిజయం సాధించింది. మహేష్ బాబు క్యారెక్టర్ ఈ మూవీ కి హైలైట్ గా నిలిచింది. ఈ మూవీ 2 జీ సినీ అవార్డ్స్ అందుకుంది.

సరిలేరు నీకెవ్వరు :శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్, ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై మహేష్ బాబు హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సరిలేరు నీకెవ్వరు”మూవీ ఘనవిజయం సాధించింది. ఆర్మీ మేజర్ (మహేష్ బాబు) తన టీమ్ లోని సోల్జర్ కుటుంబాన్ని రక్షించే నేపథ్యంలో రూపొందింది. మహేష్ బాబు స్టైలిష్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2020 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది.

పోల్ గేమ్ : సూపర్ స్టార్ మహేష్ బాబు బెస్ట్ మూవీ ?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 17 =