ఈ మధ్య డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. తమ సొంత ప్రొడక్షన్ హౌస్ లు పెట్టేసి సొంతగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను తన ప్రొడక్షన్ లో తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. మరో స్టార్ డైరెక్టర్ కొరటాల కూడా నిర్మాతగా మారనున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో టాప్ డైరెక్టర్ కూడా సొంత ప్రొడక్షన్ పెట్టె యోచనలో ఉన్నట్టు గత రెండురోజులుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ‘వర్డ్ స్మిత్ ప్రొడక్షన్స్’ అనే బ్యానర్ పెట్టి అందులో సినిమాలో తేయాలనుకుంటున్నాడట. అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం డైరెక్షన్ మాత్రం చేయాలనుకుంటున్నాడట. అంతే కాదు హారిక అండ్ హాసినిక్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ తో త్రివిక్రమ్ కు మంచి అసోసియేషన్ వుంది. ఈ నేపథ్యంలో అది అలానే కంటిన్యూ చేస్తూ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేయాలనుకుంటున్నాడట. మరి ఈ వార్తలపై త్రివిక్రమ్ స్పందించి క్లారిటీ ఏమన్నా ఇస్తాడేమో చూద్దాం.
ఇక అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై అప్పుడే అంచనాలు ఉన్నాయి. స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకొని సిద్ధంగా వున్నాడు త్రివిక్రమ్. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయి.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా టైం పట్టేలాగానే కనిపిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: