కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది..!

Mega Power Star Ramcharan Tej Pens A Heart Warming Note On Twitter As Magadheera Completes 11 Years Today

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మగధీర సినిమా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 24క్రాఫ్ట్స్ అన్నీ పర్ఫెక్ట్ గా సెట్ అయితే సినిమా విజయం అనేది అదే వస్తుంది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. పర్ఫెక్షన్ కు మారుపేరు. అందుకే జక్కన్న అంటారు. రాజమౌళి- డైరెక్షన్‌, రామ్ చరణ్-కాజల్ నటన, కీరవాణి- సంగీతం, కేకే సెంథిల్‌- సినిమాటోగ్రఫీ, పీటర్‌ హెయిన్‌- ఫైట్స్, రమ రాజమౌళి- కాస్ట్యూమ్‌ డిజైన్స్‌‌, ఇలా ప్రతి ఒక్కటి సినిమాను మరో మెట్టు ఎక్కించాయి. ఇక ఈ సినిమా నేటితో 11ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాను సోషల్ మీడియా వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు అభిమానులు కూడా సోషల్‌ మీడియాలో #11YearsForIHMagadheera ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్ కూడా తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన పలు సన్నివేశాలకు సంబంధించిన వీడియో ను పోస్ట్ చేసి ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా చాలా గొప్ప అనుభూతి మిగిల్చింది.. నాపై చిత్ర యూనిట్‌, ప్రేక్ష‌కులు చూపించిన ఆద‌ర‌ణ చాలా గొప్ప‌ది… హ‌ద్దులు చెరిపేసి ముందుకు సాగాల‌ని త‌నకు రాజ‌మౌళి సూచించార‌ని.. త‌న‌లో స్ఫూర్తి నింపిన జ‌క్క‌న్న‌కు థ్యాంక్స్ .. కష్టానికి తగిన ఫలితం దక్కుతుందనే మాట నిజ‌మైంద‌ని” ట్వీట్‌లో పేర్కొన్నాడు చెర్రీ.

 

ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌ కేకే సెంథిల్‌ కుమార్‌ ఆ నాటి ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. మగధీర షూటింగ్‌కు సంబంధించిన పలు చిత్రాలను ఆయన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here