‘బిచ్చగాడు 2’ పై విజయ్ ఆంటోని ప్రకటన..!

Vijay Antony Announces Bitchagadu 2

బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. విజ‌య్ ఆంటోనీకి తెలుగులో క్రేజ్ సంపాదించిన సినిమా అది. తెలుగు రాష్ట్రాల‌లో రూ.10 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు సాధించిం నిర్మాత‌కు లాభాలు తెచ్చి పెట్టింది. ఒక డ‌బ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం అంటే మాములు విషయం కాదు. ఇక ఆ తర్వాత ఏ సినిమా ఆ రేంజ్ లో విజయం తెచ్చిపెట్టలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి బిచ్చగాడు 2 తో రావడానికి సిద్దమయ్యాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ ఆంటోని.. బిచ్చగాడు సినిమా సీక్వెల్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన చేసాడు. అంతెేకాదు దానికి సంబంధించిన తెలుగు, తమిళ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేసాడు. 2021లో విడుదల చేయనున్నట్టు పోస్టర్‌లో ప్రకటించారు.

 

కాగా బిచ్చగాడు చిత్రాన్ని విజయ్ ఆంటోని నిర్మించగా.. శశి డైరెక్ట్ చేసాడు. ఈ సీక్వెల్‌ను మాత్రం ప్రియ కృష్ణ స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ ఆంటోని నిర్మిస్తున్నాడు. మ‌రి బిచ్చ‌గాడు ఘన విజయం అందించింది.. ఇప్పుడు ఈ సీక్వెల్ విజ‌య్‌కి మ‌రో విజ‌యాన్ని అందిస్తుందా? లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

దీనితో పాటు ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని. ‘తమిళరసన్‌’, ‘అగ్ని సిరగుగళ్‌’, ‘ఖాకీ’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగా… కరోనా వల్ల ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్ కు బ్రేక్ పడింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.