తెలుగు సినీ చరిత్రలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. వస్తున్నాయి.. వస్తుంటాయి కూడా. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఎన్నేళ్ళైనా ఎవర్ గ్రీన్ చిత్రాలుగా మిగిలిపోతాయి. అలాంటి సినిమానే డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సొగసు చూడతరమా’ సినిమా. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా 1995 జులై 14న విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గుణశేఖర్ దర్శకత్వంలో నరేష్, ఇంద్రజ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అందుకుంది. అంతేనా నాలుగు నంది అవార్డులను సైతం దక్కించుకుంది. బెస్ట్ ఫిల్మ్ గా బంగారు నంది ని అందుకున్న ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా గుణశేఖర్ నంది అవార్డును అందుకున్నారు. బెస్ట్ డైలాగ్ రైటర్ నంది అవార్డు ను అజయ్ శాంతి, బెస్ట్ కాస్ట్యూమ్స్ నంది అవార్డును కుమార్ తీసుకున్నారు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించడమే కాదు స్వయంగా నిర్మించారు.
ఇక ఈ సినిమా 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుణశేఖర్ ఆ సినిమా విశేషాలను మరోసారి గుర్తుచేసుకున్నారు. ‘సొగసు చూడతరమా’ చిన్న చిత్రంగా నిర్మించినా ప్రేక్షకులు పెద్ద విజయాన్ని అందించడమే కాకుండా ఉత్తమ చిత్రం గా బంగారు నంది రావడం, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నాకు, బెస్ట్ డైలాగ్ రైటర్ గా అజయ్ శాంతి కి, కాస్ట్యూమ్స్ కి కుమార్ కు కూడా నంది రావడం ఆ సినిమా దర్శకనిర్మాత గా ఎంతో ఆనందాన్ని కలిగించింది. ప్రేక్షకుల రివార్డ్స్ ను ప్రభుత్వ అవార్డ్స్ ను అందుకుని నా సినీ జీవితంలో అన్ని విధాలా సంతృప్తిని కలిగించి ఒక స్వీట్ మెమరీ గా నిలిచిన ‘సొగసు చూడతరమా’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ఆ చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు, అవార్డ్స్ ఇచ్చి గౌరవించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు గుణశేఖర్.
మొదటినుండి గుణశేఖర్ విభన్నమైన సినిమాలే చేసేవారు. మనోహరం, ఒక్కడు, రుద్రమదేవి వంటి చిత్రాలే ఇందుకు ఉదాహరణ. ప్రస్తుతం `హిరణ్యకశ్యప`సినిమా పనుల్లో బిజీగా వున్నారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. రానా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తయింది. కరోనా వల్ల ఇంకా పట్టాలెక్కలేదు. ఒక్కసారి పరిస్థితులు మెరుగుపడితే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: