నాగశౌర్య ఫిట్ నెస్ గోల్స్ – అలసిపోతే ఆగను..!

Tollywood Young Actor Naga Shaurya Posts His Workout Video On Twitter With A Quirky Caption

లాక్ డౌన్ స‌మ‌యంలో షూటింగుల‌న్నీ బంద్ అయ్యాయి. మ‌ళ్లీ సినిమాలు, షూటింగ్ ల హ‌డావిడి ఎప్పుడు మొద‌ల‌వుతుందో చెప్పలేం. ఇక దొరికిన ఈ ఖాళీ సమయాన్ని యంగ్ హీరోలు తమ ఫిట్ నెస్ కోసం బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే నిఖిల్, సందీప్ కిషన్ 6 ప్యాక్ లు చేసి తమ బాడీ ట్రాన్స్ఫమేషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక మరో యంగ్ హీరో నాగ శౌర్య కూడా ఈ స‌మ‌యాన్ని బాగానే ఉప‌యోగించుకున్నాడు. ఇప్పుడు నాగ శౌర్య లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తను వర్క్ అవుట్ చేసిన వీడియో ఒకటి తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ వర్కౌట్ వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు వీడియోతో పాటు అలసిపోతే ఆపను, అనుకున్నది పూర్తయిన తర్వాతే అపుతాను అంటూ తనకున్న డెడికేషన్ ను కూడా చెప్పాడు. దీనితో నాగశౌర్య కొటేషనే కాదు.. ఫిట్ నెస్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీన్నిబట్టి నాగ శౌర్య గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక సరికొత్త లుక్ తో రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. అశ్వద్దామ సినిమాలోనే మంచి ఫిట్నెస్ తో కనిపించాడు నాగశౌర్య. రాబోయే సినిమాల్లో కూడా రొటీన్ కాకుండా డిఫరెంట్ గా కనిపించడానికి బాగానే ట్రై చేస్తున్నాడు.

ఇక అశ్వద్ధామ సినిమాతో ఈ ఏడాది ప్రారంభించాడు నాగశౌర్య. ఈ సినిమా మంచి ప్రశంసలే దక్కించుకుంది. గత సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా చేసాడు. ఇక ప్రస్తుతం మూడునాలుగు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. . నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతుంది. అవసరాల శ్రీనివాస్ తో ఒక సినిమా, సంతోష్ జాగర్లమూడితో మరో సినిమా లైన్లో పెట్టాడు. ఈ లాక్ డౌన్ లో కూడా మరో రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. వాటి వివరాలు తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.