“తలైవి ” మదర్ క్యారెక్టర్ లో భాగ్యశ్రీ

Bollywood Veteran Actress Bhagya Sree Plays Jayalalitha Mother In Thailavi Movie.

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో లెజెండరీ యాక్ట్రెస్ , తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత రీల్ లైఫ్ , రియల్ లైఫ్ లో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా “తలైవి ” తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా, అరవింద్ స్వామి ఎమ్ జి ఆర్ , ప్రకాష్ రాజ్ కరుణా నిధి పాత్రలలో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ , రచిత అరోరా సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“తలైవి ” మూవీ తమిళ భాషతో పాటు పలు భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. క్లైమాక్స్ సీన్ బ్యాలెన్స్ ఉన్న “తలైవి ” మూవీ జూన్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ లో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ జయలలిత మదర్ సంధ్య క్యారెక్టర్ లో నటిస్తున్నారు. కంగనా రనౌత్ , భాగ్యశ్రీ కాంబినేషన్ సీన్స్ ఎమోషనల్ గా ఉంటాయని సమాచారం. భాగ్యశ్రీ ఈ మూవీ తో పాటు ప్రభాస్ హీరోగా రూపొందుతున్న “రాధే శ్యామ్ ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. భాగ్యశ్రీ నటించే పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 5 =