‘లవ్ మార్నింగ్ వాక్స్’ అంటున్న బన్నీ..!

Stylish Star Allu Arjun Shares His Morning Walk Pic On Instagram With A Cool Caption

బన్నీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అసలు టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ బన్నీ నుండే స్టార్ట్ అయిందంటేనే చెప్పొచ్చు ఫిట్ నెస్ పై ఎంత ఇంట్రస్ట్ ఉందో. ఇక ప్రస్తుతం కరోనా కాబట్టి ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే బన్నీ ఇంటికే మరిమితమయ్యాడు. ఇక వర్కవుట్లు చేయడానికి జిమ్‌లు లేవు కాబట్టి ఇంట్లోనే వుంటూ వర్క్ ఔట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ కూడా మార్నింగ్ వాక్ చేస్తూ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా బన్నీ మార్నింగ్ వాక్ చేస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా మార్నింగ్ వాక్ పై ఉన్న ఇష్టాన్ని తెలియచేసాడు. తెల్లవారు జామున వాకింగ్ చేస్తున్న ఫొటోను బన్నీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసి.. `లవ్ మార్నింగ్ వాక్స్` అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇక మార్నింగ్ వాక్ కోసం బన్నీ తెల్లవారు జామునే హైదరాబాద్ నగరం శివారు ప్రాంతాలకు వెళ్ళినట్టే అనిపిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

Love Morning Walks 💙

A post shared by Allu Arjun (@alluarjunonline) on

కాగా అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సింది కానీ కరోనా వల్ల బ్రేక్ పడింది. త్వరలోనే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు. హీరోయిన్ గా రష్మిక మందన్ననటిస్తుండగా మరో హీరోయిన్‌ గా నివేత పేతురాజ్ కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + one =