కొత్త మేకోవర్ తో రెండో సినిమా ప్లాన్..!

Real Star Srihari Younger Son Megahamsh Srihari All Set To Start His Second Movie

టాలీవుడ్ లో వారసులు ఎంట్రీ ఇవ్వడం కామనే. ఆనాటి స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది ఈనాటి స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. కానీ చిన్న హీరో అయినా… పెద్ద హీరో అయినా.. అప్ కమింగ్ హీరో అయినా.. వారసత్వ హీరోలైనా ఎవరి భవిష్యత్ అయినా సరే బాక్సాఫీస్ డిసైడ్ చేయాల్సిందే. అలానే విలక్షణ నటుడు, రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంష్ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్-కార్తీక్ దర్శకత్వంలో ‘రాజ్ దూత్’ సినిమాతో మేఘాంష్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. శ్రీహరి కొడుకు కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి కానీ.. సినిమా అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేకపోయింది. హీరో గా మేఘాంష్ కు మాత్రం మంచి ప్రశంసలే దక్కాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు రెండో సినిమాకు రెడీ అయితున్నట్టు తెలుస్తుంది. ఆ సినిమా కోసం ఫిజిక్ లో మార్పులు.. లాంగ్ హెయిర్, లైట్ గడ్డం తో కొత్త మేకోవర్ తో కనిపించడానికి సిద్ధమవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు, కాస్ట్ అండ్ క్రూ వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. చూద్దాం మరి రెండో సినిమాతో అయినా మేఘంష్ లక్ మారుతుందేమో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =