తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ తాప్సీ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉండే మూవీస్ ను తాప్సీ ఎంపిక చేసుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. “హసీనా దిల్ రుబా “, “శభాష్ మిథు ” మూవీస్ తో పాటు మరో హిందీ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “జనగణమన “తమిళ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆకాష్ భాటియా దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ తాప్సీ ప్రధాన పాత్రలో థ్రిల్లర్ మూవీ “లూప్ లపేటా” బాలీవుడ్ మూవీ రూపొందనుంది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణం గా షూటింగ్స్ నిలిచిపోయి, రిలీజ్ లు ఆగిపోయి చిత్ర పరిశ్రమ పలు విధాలుగా నష్టపోయింది. మూవీ షూటింగ్స్ కు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చినా స్టార్ హీరో , హీరోయిన్స్ షూటింగ్ లో పాల్గొనడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమయం లో కరోనా బీమా తెర పైకి వచ్చింది. కరోనా బీమా అంటే షూటింగ్ టైమ్ లో చిత్ర యూనిట్ లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే మిగిలిన వారంతా హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుంది. దాంతో షూటింగ్ వాయిదా పడుతుంది. షూటింగ్ జరగని రోజుల నష్టాన్ని కరోనా బీమా తో భర్తీ చేసుకోవచ్చు. ఇప్పుడు “లూప్ లపేటా” మూవీ కరోనా బీమా ప్రాసెస్ లో ఉంది. తాప్సీ నటించే “లూప్ లపేటా” మూవీ కరోనా బీమా చేయించుకున్న ఇండియా లోనే మొదటి మూవీ గా నిలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: