‘ఆదిత్య 369’ సెట్స్ నుండి .. ఆనాటి జ్ఞాపకాలు.. !

let's revisit and recall the epic Science Fiction Movie Aditya 369 through these throwback photos

ఒకప్పుడు ఉన్న టెక్నాలజీ కి ఇప్పుడున్న టెక్నాలిజీకి ఎన్నో మార్పులు. అప్పట్లో సినిమా మొదలైన విషయం ఎవరికీ తెలిసేది కాదు.. ముగిసిన విషయం కూడా ఎవరికీ తెలిసేది కాదు. ఎప్పుడో సినిమా రిలీజ్ కి ముందు చిన్న ఫంక్షన్ లాంటిది ఏదైనా జరిగితే అప్పుడు తెలిసేది. ఇప్పుడు అలా కాదు. సినిమా లాంచ్ అయిన దగ్గర నుండి… సినిమా రిలీజ్ అయ్యేవరకూ అప్ డేట్స్ ఇస్తూనే వుంటారు. సినిమా పోస్టర్లు, పాటలు, ఇంటర్వ్యూ లు ఇలా ఎన్నో రకాలుగా ప్రచారం చేస్తారు. అందుకే అప్పటి సినిమా విశేషాలు కానీ.. అప్పటి ఫొటోలు కానీ ఇప్పుడు చూస్తుంటే మనకు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అవి కూడా అప్పట్లో ఉన్న కెమరామెన్ లు సెట్స్ లో అప్పుడప్పుడు కొన్ని ఫొటోస్ ను క్లిక్ మనిపిస్తారు. ఈ నేపథ్యంలో ‘ఆదిత్య 369’ సెట్స్ నుండి తీసిన కొన్ని ఫొటోస్ చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రయోగాల దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు చేసిన మరో ప్రయోగమే ఆదిత్య 369. టైమ్‌ మెషీన్ బ్యాక్ డ్రాప్ తో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన తొలి తెలుగు సినిమాగా బాలకృష్ణ సినీ కెరీర్‌లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ మైలు రాయిగా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.టైమ్ మిషన్, శ్రీ కృష్ణ దేవరాయలు కాలం సెట్టింగ్స్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. కృష్ణకుమార్‌గా, శ్రీ కృష్ణ దేవరాయలుగా ద్విపాత్రాభినయం చేసి తన నటనతో ఆకట్టుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ను తెరకెక్కించాలని కూడా చూస్తున్నారు. గతంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని పలుమార్లు తెలిపినా అది అవ్వలేదు. ఇప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ రావు మరోసారి బాలయ్యను డైరెక్ట్ చేసి ఈ సినిమాతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. మరి అప్పటిలాంటి సినిమాలు ఇప్పుడు రావడం అంటే కొంచం కష్టమైన విషయమే. వచ్చినా ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియని పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

ప్రస్తుతం బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో బాలయ్య కనిపించనున్నాడట. రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర చేయనున్నాడు. వాటిలో ఒకటి అఘోరా పాత్ర కావడం విశేషం. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =