సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ను టార్గెట్ చేయడం కొత్తెం కాదు. ఎంతో మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో కామెంట్స్ కు, ట్రోలింగ్స్ కు గురైన వారే. అయితే ఒకప్పుడు సెలబ్రిటీస్ అలానే అనుకుంటార్లే అని చూసి చూడనట్టు వొదిలేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సెలబ్రిటీస్ కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటున్నారు.నెటిజన్స్ ఏదైనా కౌంటర్ వేసినా.. కామెంట్ చేసినా దానికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరోను టార్గెట్ చేసిన ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. ఆ యంగ్ హీరో ఎవరో కాదు.. సందీప్ కిషన్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనాతో చనిపోయిన వ్యక్తుల మృతదేశాలకు ప్రొక్లైయిన్తో తీస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేస్తూ `సందీప్ కిషన్, కోన వెంకట్లు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు` అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ కు ఆగ్రహం చెందిన సందీప్ కిషన్… నేను మంచి మాత్రమే స్ప్రెడ్ చేయాలనుకుంటున్నా.. మంచి ఎక్కడ చేసినా నేను అప్రిషియేట్ చేస్తాను. ఈ టైంలో ఇంకా అవసరం.. నాకు పొలిటికల్ నాలెడ్జ్ జీరో. నేను ఆ నాలెడ్జ్ పెంచుకోవాలని కూడా అనుకోవటం లేదు. ఆ మంచి నువ్వు చేసి నా కంట పడ్డా.. ఆ విషయాన్ని సెలబ్రేట్ చేసే ఫస్ట్ పర్సన్ నేనే` అంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు ఫైనల్ గా నా ట్విట్టర్ నా ఇష్టం అంటూ కౌంటర్ ఇచ్చాడు.
Dear @sundeepkishan @konavenkat99 where are you hiding now?? https://t.co/TWxjc6261q
— Dinesh Madhipati #SaveAmaravati (@naidusdinesh127) July 6, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: