నిర్మాతగా చిరంజీవి తనయ సుస్మిత

Mega Star Chiranjeevi Daughter Sushmita To Produce Web Series Through Her Own Production House

మెగా స్టార్ చిరంజీవి తనయ సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ట్రెండ్ కు తగినట్టుగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం సుస్మిత ప్రత్యేకత. చిరంజీవి హీరోగా రూపొందిన ఎపిక్ యాక్షన్ మూవీ “సైరా నరసింహా రెడ్డి ” లో ఆకాలానికి తగ్గట్టుగా సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైన్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న “ఆచార్య ” మూవీ కి సుస్మిత కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేస్తున్నారు. సుస్మిత ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి ఒక వెబ్ సిరీస్ కు సుస్మిత శ్రీకారం చుట్టారు. పలు వెబ్ సిరీస్ లకు ప్లాన్ చేసిన సుస్మిత భవిష్యత్ లో తన ఫ్యామిలీ హీరోస్ తో మూవీస్ కూడా నిర్మించాలని అనుకొంటున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − five =