అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుసగా స్టార్ హీరోలను లైన్ లో పెడుతున్నాడు. స్టార్ హీరోస్ కూడా త్రివిక్రమ్ తో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. త్రివిక్రమ్ తన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన లో వస్తున్న సినిమా కాబట్టి సినిమాపై అప్పుడే అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలంటే మాత్రం.. ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోవాల్సిందే. మరోపక్క స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసుకొని సిద్ధంగా వున్నాడు. అయితే ఆర్ఆర్ఆర్ షూటింగ్ అయిపోయి.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆ గ్యాప్ లో ఇంకో సినిమా తీసుకోవచ్చే ప్లాన్ లో ఉన్నాడట త్రివిక్రమ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం లాక్ డౌన్ కాబట్టి చాలా ఫ్రీ టైం ఉంది. ప్రస్తుతం వెంకటేష్-నాని కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉండగానే ఇటీవలే త్రివిక్రమ్ చరణ్ ని కలిసినట్టు తెలుస్తుంది. చరణ్ కు త్రివిక్రమ్ ఒక లైన్ అప్ చెప్పాడట. ఇక ఇప్పటికే త్రివిక్రమ్ పవన్ కాంబినేషన్ లో సినిమా వస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో చిరు సినిమా ఉంటుందన్న వార్తలు కూడా ఎప్పటినుండో వస్తున్న సంగతి తెలిసిందే. చిరు – కొరటాల సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అన్నారు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో సినిమాపై కూడా టాలీవుడ్ లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
మొత్తానికి త్రివిక్రమ్ వరుసపెట్టి స్టార్ హీరోలను లైన్ లో పెట్టాడు. ఎన్టీఆర్ తో సినిమా పక్కా ఉంటది. మరి మిగిలిన హీరోల్లో ఏ హీరోతో సినిమా వుండబోతుందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: