త్వరలోనే “అల్లుడు అదుర్స్” షూటింగ్ !

Alludu Adhurs Movie Shooting To Hit The Floors Soon

సక్సెస్ ఫుల్ “రాక్షసుడు ” మూవీ తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, “కందిరీగ “, “హైపర్ ” మూవీస్ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “అల్లుడు అదుర్స్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇస్మార్ట్ గర్ల్ నభా నటేష్ , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు కాగా సోను సూద్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

జి. సుబ్రమణ్యం నిర్మాతగా రూపొందుతున్న “అల్లుడు అదుర్స్ ” మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగ్స్ కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నిర్మాణ సంస్థలు రిస్క్ తీసుకొనడానికి సుముఖంగా లేవు. ఇప్పుడు “అల్లుడు అదుర్స్ ” మూవీటీమ్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించ నుంది. ఈమూవీ నెక్స్ట్ షెడ్యూల్ జులై మొదటి వారం లో ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ షెడ్యూల్ తరువాత బ్యాలెన్స్ టాకీ పార్ట్ , సాంగ్స్ ను సింగిల్ షెడ్యూల్ లో చిత్రీకరించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here