మారుతి కూతురి టాలెంట్ – హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అభినందనలు..!

Tollywood Movie Director Maruthi Daughter Gets A Pat From Hollywood Acclaimed Cinematographer For Her Photography Skills
Tollywood Movie Director Maruthi Daughter Gets A Pat From Hollywood Acclaimed Cinematographer For Her Photography Skills

డైరెక్టర్ మారుతి పుత్రికోత్సాహంలో ఉన్నాడు ప్రస్తుతం. దీనికి కారణం తన కూతురి ఫొటోగ్రఫీనే కారణం. మారుతి కూతురు హియాకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. తను తీసిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకుంటుంది. అలా తాను రీసెంట్ గా తీసిన కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వాటికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్ లైక్ చేసి, హియాను ప్రత్యేకంగా అభినందించారు. ఇక ఈ విషయాన్ని మారుతి స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ తన కూతురి టాలెంట్ కి పొంగిపొతున్నారు. తన కూతురు విషయంలో గర్వంగా ఫీలవుతున్నట్లు ట్వీట్ చేసి తన ఆనందం వ్యక్తం చేశాడు. డ్యాన్ సినిమాటోగ్రఫీ అందించిన సినిమాల్లో ‘జూన్ విక్ 2, ది షేప్ ఆఫ్ వాటర్’ వంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. మరి అంత పెద్ద డీఓపీ అభినందనలు దక్కడం అంటే మాములు విషయం కాదు మరి. మరి హియా ఫ్యూచర్ సినిమాటోగ్రఫర్ అవుతుందేమో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక హియా తాజాగా మారుతీ డైరెక్ట్ చేసిన ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా చెల్లెలుగా నటించింది. ఇక మారుతి గత ఏడాది ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో హిట్ కొట్టాడు. ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే ఈ సారి మాత్రం పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు మాత్రం తెలుస్తుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here