ఏపీ,తెలంగాణ ప్రభుత్వాల వరకూ వెళ్లిన మీరాచోప్రా – ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్

Actress Meera Chopra Seeks Protection From Jr NTR Fans Takes Issue To The Notice Of Telangana And Andhra Pradhesh State Governments
Actress Meera Chopra Seeks Protection From Jr NTR Fans Takes Issue To The Notice Of Telangana And Andhra Pradhesh State Governments

మొత్తానికి మీరా చోప్రా, ఎన్టీఆర్ అభిమానుల మధ్య వార్ పెద్ద వివాదానికే దారి తీసేలా ఉంది. `నాకు ఎన్టీయార్ గురించి తెలియదు. నేను ఎన్టీయార్ ఫ్యాన్‌ను కాదు.. అని మీరా చోప్రా అనడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆమెపై విరుచుకుపడ్డారు. ఇక దానితో మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులను సైతం ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాదు నాపై సామూహిక అత్యాచారానికి పాల్పడతానన్నారు. యాసిడ్ దాడి చేస్తామన్నారు. మా తల్లిదండ్రులను చంపేస్తామన్నారు. వీటిని ఆపడం ఎలా? మహిళలకు కనీసం గౌరవం లేదు. ఈ రోజు నేను.. రేపు మరొకరు. ఈ పోరాటంలో నేను నిలబడతా. వాళ్లు (ఎన్టీయార్ ఫ్యాన్స్) మహిళలకే కాదు.. ఎవ్వరికీ గౌరవం ఇవ్వడం లేదు. మిగతా నటులను కూడా అసభ్యంగా తిడుతున్నారు. అంటూ పలు ట్వీట్ లు కూడా చేసింది. అక్కడితో ఆగకుండా ఈ వివాదంలోకి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలని కూడా తీసుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తనపై కొందరు తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఈ విషయంలో చర్యలు తీసుకోవాలంటూ మీరా చోప్రా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేసింది. దాంతో ఆయన వెంటనే స్పందించి.. మేడమ్ రాష్ట్ర డీజీపీ, హైదరాబాద్ సీపీలకు విషయం తెలియజేశారు… చట్ట ప్రకారం వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు అని రిప్లై ఇచ్చారు. దీనిపై మీరా చోప్రా ట్విటర్ లో కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపింది. “థాంక్స్ సర్… మీ మేలు మర్చిపోలేను. మహిళల భద్రతకు ఇది ఎంతో ముఖ్యం అని భావిస్తున్నాను. ఇలాంటి వాళ్లను స్వేచ్ఛగా వదలకూడదు, లేకుంటే మహిళలపై నేరాలు మరింత పెరుగుతాయి” అంటూ ట్వీట్ చేసింది.


ఫ్యాన్స్ పేరుతో తనపై అసభ్యకర కామెంట్స్ చేస్తూ ట్విట్టర్‌లో తనను వేధిస్తున్నారని.. గ్యాంగ్ రేప్‌ చేస్తామని,యాసిడ్ దాడి చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని… సీఎం జగన్‌ను, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను కూడా ట్యాగ్ చేశారు. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని.. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు.

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ ఎవరో నాకు తెలీదు అని అన్నందుకు ఒక్క అభిమాని కూడా మిమ్మల్ని తిట్టలేదని..మీరు నెగిటివ్ పోస్ట్స్ ని లైక్స్ చేస్తూ & వెటకారంగా మాట్లాడిన దానికే మా ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారని కొంతమంది అభిమానులు అంటున్నారు. మరి చూద్దాం ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో.. అసలు ఈ విషయంపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 8 =