కొత్త జీవితం ప్రారంభమైంది.. త్వరలో చెప్తా..!

Its Time To Begin A New Life Says Nachavule Actress Madhavi Latha
Its Time To Begin A New Life Says Nachavule Actress Madhavi Latha

మాధవీలత.. నచ్చావులే సినిమాతో తెలుగు తెరపై అరంగేట్రం చేసింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే తర్వాత ఒకటి రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి కానీ అవి పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ఇక ఆ తరువాత సినిమాకే కాదు బయటి ప్రపంచానికి కూడా సరిగా కనపడలేదు. అయితే ఈ మధ్య బయటకు వచ్చిన మాధవీలత పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఏ విషయం గురించైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం మాధవీలత నైజాం. అందుకే తను ఏం మాట్లాడినా కాస్త వివాదాస్పదంగానే ఉంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాజాగాఆసక్తికరంగా మారింది. తన వ్యక్తిగత విషయం గురించి మాధవీలత ఓ పోస్ట్ చేసింది. `ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలో వెల్లడిస్తాన`ని పోస్ట్ చేసింది. మరి ఇది చూసిన తర్వాత నెటిజన్స్ సైలెంట్ గా వుంటారా. అప్పుడే పలు కామెంట్స్ పెట్టేస్తున్నారు. మాధవీలత తన వివాహం గురించే ఈ విధంగా కామెంట్ చేసి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి మాధవీలత పోస్ట్ వెనుక కారణం ఏంటో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే మరి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =