దర్శకేంద్రుడి సినిమాలో యంగ్ హీరో..!

This Tollywood Young Hero To Play The Lead Role In Legendary Director K Raghavendra Rao Movie

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తన కొత్త సినిమాపై మళ్లీ అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది ఎన్టీఆర్ జయంతి సందర్బంగా కొత్త సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ముగ్గురు డైరెక్టర్స్ తో ముగ్గురు హీరోయిన్స్ తో ఈ సినిమా ఉంటుందని చెబుతూ ఓ పోస్టర్ ను కూడా రాఘవేంద్రరావు విడుదల చేశారు. అయితే అప్పటినుండి ఈ సినిమాకు సంభందించిన అప్ డేట్ లేదు. అయితే మళ్ళీ దాదాపు ఏడాది తర్వాత ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమా తో ఎంటర్ టైన్ చేయడానికి వస్తాను.. ప్రామిస్ చేస్తున్న.. అని ట్వీట్ చేసారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక అప్పుడే మళ్లీ ఈ సినిమాలో హీరోపై రూమర్లు వచేస్తున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం హీరో నాగ శౌర్య చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే గతంలోనే నాగ శౌర్య పేరు తెరపైకి వచ్చింది. మళ్ళీ ఈ సినిమా తెరపైకి రావడంతో మరోసారి వార్తలు ఊపందుకున్నాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

కాగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మెగా ఫోన్ పట్టి చాలా కాలం అవుతుంది. ఆయన చివరి చిత్రం ఓమ్ నమో వెంకటేశాయ. నాగార్జున, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలలో వచ్చింది. ఈ మూవీ విడుదలై దాదాపు మూడేళ్లు కావస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =