బాలకృష్ణను మేమెలా పిలుస్తాం.. మాకే తెలీదు..! 

MAA President Naresh Condemns Producer Kalyan Comments On Inviting Nandamuri Balakrishna To Meeting

తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో చర్చలు జరపడంపై నటుడు నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలకృష్ణ వివాదం మొత్తానికి పెద్ద దుమారమే రేపేలా ఉంది టాలీవుడ్ ఇండస్ట్రీలో. సీఎం కేసీఆర్ తో సమావేశానికి నందమూరి బాలకృష్ణను పిలవకపోవడం వివాదాస్పదమైంది. మంత్రి తలసానితో కలిసి భూములు పంచుకుంటున్నారా అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇప్పటికే ఈ వివాదంపై పలువురు స్పందించారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. తన వ్యాఖ్యలపై బాలయ్య క్షమాపణలు చెప్పాలని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా ఇప్పుడు మా అధ్యక్షుడు నరేష్ నిర్మాత సి.కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు. బాలకృష్ణను ఈ సమావేశానికి ఆహ్వానించాల్సిన బాధ్యత మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)దేనని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలను మా అధ్యక్షుడు నరేశ్ ఖండించారు. బాలయ్యను పిలవాల్సింది ‘మా’నే అంటూ సి.కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తనను షాక్‌కు గురిచేశాయని అన్నారు. మా అధ్యక్షుడి హోదాలో ఉన్న తనకు ఈ సమావేశాలు జరుగుతున్న సంగతే తెలియదని, తనకే కాదు, మా ప్రధాన కార్యదర్శికి కూడా ఈ విషయం తెలియదని, తమకే తెలియనప్పుడు మరొకరిని ఈ సమావేశాలకు ఎలా ఆహ్వానిస్తామని నరేశ్ ట్వీట్ చేశారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here