[POLL]: ‘ప్రభాస్ 21’.. ఏ బాలీవుడ్ బ్యూటీ బెస్ట్?

Which Of These Bollywood Actress Can Make The Best Pair With Prabhas In Prabhas 21?

‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ – ఇండియా స్టార్‌గా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఆపై వచ్చిన ‘సాహో’తో దక్షిణాదితోపాటు ఉత్తరాదిన కూడా తన ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకున్నాడు. ఈ క్ర‌మంలోనే.. ప్రభాస్ అప్‌క‌మింగ్ ఫిలిమ్స్ కూడా పాన్ ఇండియా మూవీస్‌గా తెరకెక్కుతుండ‌డం వార్త‌ల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా ‘జిల్’ రాధాకృష్ణ తెర‌కెక్కిస్తున్న పిరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కూడా ఇదే బాట పట్టనుండడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. ‘ప్రభాస్ 21’గా తెరకెక్కనున్న చిత్రానికి ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందనున్న ఈ పాన్ ఇండియా మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో సెట్స్‌పైకి వెళ్ళ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ 2022 వేస‌విలో రిలీజ్ కానుంది. కాగా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ప్రభాస్ సరసన ఓ బాలీవుడ్ బ్యూటీ నటించనుందని ప్ర‌ముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే దీపికా పదుకుణే, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, అలియా భట్.. ఇలా ప‌లువురు హిందీ నాయిక‌ల పేర్లు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ నేపథ్యంలో.. ప్రభాస్‌కు జోడిగా ఏ ‘బీటౌన్ బ్యూటీ’ అయితే బాగుంటుంద‌నే విషయంపై ఆసక్తికరమైన పోల్ గేమ్‌ను నిర్వహిస్తోంది ‘ది తెలుగు ఫిలిమ్‌ నగర్.కామ్’. మీ అభిప్రాయాన్ని మీ ఓటు ద్వారా తెలియజేసే అవ‌కాశ‌మిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.

ప్రభాస్ 21’.. ఏ బాలీవుడ్ బ్యూటీ బెస్ట్?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =