కంటెంట్, కటౌట్.. రెండూ ఉన్న కథానాయకుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ – ఇండియా స్టార్‌గా అవతరించాడు ఈ ఉప్పలపాటి వారి హ్యాండ్సమ్ హీరో. కేవలం సోషల్ సబ్జెక్టులకే కాదు, ఫోక్‌లోర్ మూవీస్‌లోనూ రాణించగలనని చెప్పకనే చెప్పాడు. త్వరలో ఓ పిరియాడిక్ రొమాంటిక్ సాగాలో కనిపించనున్న ప్రభాస్.. ఆపై నాగ్ అశ్విన్ రూపొందించనున్న సైన్స్ ఫిక్షన్‌లోనూ సందడి చేయనున్నాడు. మొత్తంగా డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేస్తూ, కొత్త సవాళ్ళతో ముందుకు సాగుతున్నాడు ప్రభాస్. ఈ క్రమంలో.. ప్రభాస్ పురాణ పాత్రలో ఎప్పుడెప్పుడు కనిపిస్తాడా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తన పెదనాన్న కృష్ణంరాజు శివుడు, కర్ణుడు వంటి పురాణ పాత్రల్లో దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో.. పెదనాన్న బాటలోనే ప్రభాస్ కూడా సమీప భవిష్యత్తులో మైథలాజికల్ రోల్ చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేం. దానికి తోడు.. ఇప్పటికే ‘రాఘవేంద్ర’ సినిమాలో రాఘవేంద్రస్వామి భక్తుడుగానూ, ‘బాహుబలి: ది బిగినింగ్’లో శివ భక్తుడుగానూ కాస్త డివోషనల్ టచ్ ఇచ్చాడు ప్రభాస్. అలాగే, ‘మిర్చి’లో మోడరన్ కృష్ణుడుగా కాసేపు తళుక్కున మెరిసాడు ప్రభాస్. ఒకవేళ భవిష్యత్తులో ప్రభాస్ ఏదైనా మైథలాజికల్ మూవీ చేస్తే.. తనని ఎలాంటి పాత్రలో చూడాలనుకుంటున్నారో అన్న విషయంపై ఆసక్తికరమైన పోల్ గేమ్ నిర్వహిస్తోంది “ది తెలుగు ఫిలిం నగర్.కామ్”. మీ అభిప్రాయాన్ని మీ ఓటు ద్వారా తెలియజేసే ప్రయత్నమిది. మరెందుకు ఆలస్యం.. పోల్ గేమ్‌లోకి ఎంటర్ అవుదాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”43115″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: