‘బుట్టబొమ్మ’ సాంగ్‌ పాడుతున్న ‘చిన్ని బుట్టబొమ్మ’

Allu Arjun Daughter Allu Arha Gives Perfect Lip Sync For Butta Bomma Song From Ala Vaikunthapurramuloo Movie

త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ‘అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. ఇక ఈ ఆడియో గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ అందించిన ఆడియో కూడా ఈ సినిమా విజయానికి ఒక కారణమే. ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసాయి ఈ పాటలు. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈ పాటకు ఎంతో మంది సెలెబ్రిటీస్ తమ స్టెప్పులేసి అలరించారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరో చిట్టి బుట్ట బొమ్మ కూడా ఈ పాట పడేసింది. ఆ బుట్ట బొమ్మ ఎవరో కాదు అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ. అల్లు అర్హ చేసే అల్లరి గురించి ఇప్పటికే మనం చాలా వీడియో ల్లో చూసాం. పలు సందర్భాల్లో ఇందుకు సంబంధించిన వీడియోలను బన్నీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తునే ఉంటాడు. ప్రతి వీడియోలో అర్హ తనదైన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇక గతంలోనే ఓ మై గాడ్‌ డాడీ లిరికల్‌ సాంగ్‌ వీడియోలో తన అన్న అయాన్‌తో కలిసి సందండి చేసింది. అలాగే రాములో రాములా సాంగ్‌లో బన్నీ దోశ స్టెప్పు వేశాడని ఫన్నీ కామెంట్‌ చేసింది. తాజాగా ఆ చిత్రంలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ బుట్టబొమ్మకు అర్హ.. లిప్‌ సింక్‌ ఇచ్చింది. బ్యాగ్రౌండ్‌లో వేరే వాయిస్‌తో సాంగ్‌ ప్లే అవుతున్న సమయంలో లిరిక్స్‌కు అనుకూలంగా అర్హ లిప్ సింక్ ఇచ్చింది. ఇక ఈ వీడియో ను స్నేహరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘మా చిన్ని బుట్టబొమ్మ.. బుట్టబొమ్మ సాంగ్‌ పాడుతోంది.. క్వారంటైన్‌ ఫన్‌’ అని పోస్ట్ పెట్టింది. ఇక ఈ వీడియో చూసిన మెగా డాటర్‌ నిహారిక.. ‘హ..హ.. చిలక’ అని కామెంట్‌ కూడా చేశారు. మరి ఈ చిట్టి బుట్ట బొమ్మ పాడిన బుట్ట బొమ్మ పాట కూడా చాలా క్యూట్ గా ఉంది కదా.

 

 

View this post on Instagram

 

Our lil #buttabomma singing #buttabomma #quarantinefun

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − four =