కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ‘A”, “ఉపేంద్ర”,” ఓం”, “కన్యాదానం”, “S/O సత్యమూర్తి ” మూవీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఉపేంద్ర ఇప్పుడు బహు భాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై దర్శక, నిర్మాత ఆర్ చంద్రు దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ “కబ్జ” మూవీ రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కబ్జ” మూవీ కన్నడ భాషతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ , బెంగాలీ భాషలలో తెరకెక్కుతుంది. 1980 ల కాలంనాటి పరిస్థితుల నేపథ్యం లో రూపొందుతున్న “కబ్జ” మూవీ లో జగపతి బాబు, నానా పాటేకర్, మనోజ్ బాజ్ పాయ్ , ప్రదీప్ రావత్, ప్రకాష్ రాజ్, సముద్ర ఖని, జయప్రకాశ్ రెడ్డి విలన్స్ గా నటిస్తున్నారు. తెలుగు భాషలో “కబ్జ” మూవీని లగడపాటి శ్రీధర్ సమర్పిస్తున్నారు. నిర్మాత ఆర్. చంద్రు చైనీస్ భాషలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేసింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: