పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘ప్ర‌స్థానం’కు ప‌దేళ్ళు

Sharwanand Political Thriller Movie Prasthanam Completes 10 Years

తెలుగునాట పలు పొలిటికల్ థ్రిల్ల‌ర్స్‌ సందడి చేసాయి. వాటిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తే.. మరికొన్ని విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలా.. ప్రశంసలు అందుకున్న చిత్రాల్లో ‘ప్ర‌స్థానం’ ఒక‌టి. రాజకీయాలు, కుటుంబ భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు దేవా కట్టా. శ‌ర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్(తొలి చిత్రం) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పొలిటికల్ డ్రామాలో.. రూబీ ప‌రిహార్, రష్మి గౌతమ్, ప‌విత్ర లోకేష్, సురేఖా వాణి, మ‌ధుసూద‌న‌రావు, ‘వెన్నెల’ కిషోర్, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, ర‌విప్ర‌కాష్‌, మ‌న్న‌వ బాల‌య్య‌, జీవా, పృధ్వీరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వ‌న‌మాలి, దేవ క‌ట్టా, చైత‌న్య ప్ర‌సాద్ గీత ర‌చ‌న చేయ‌గా.. మ‌హేష్ శంక‌ర్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. “ముర‌ళీలోలా”, “ఇన్నాళ్ళుగా”, “నీరెండల్లో”, “ప‌య‌న‌మే”, “నాయుడొచ్చాడోయ్” వంటి పాట‌లు అల‌రించాయి. ఉత్త‌మ తృతీయ చిత్రం, ఉత్త‌మ స‌హాయ న‌టుడు (సాయికుమార్‌) విభాగాల్లో “నంది” పుర‌స్కారాన్ని కైవ‌సం చేసుకున్న ఈ చిత్రాన్ని.. ర‌వి వ‌ల్ల‌భ‌నేని నిర్మించారు. 2010 ఏప్రిల్ 16న విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ‘ప్ర‌స్థానం’.. నేటితో ద‌శాబ్దకాలం పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 6 =