కృష్ణ‌, కృష్ణంరాజు మ‌ల్టీస్టార‌ర్ ‘అమ్మకోసం’కు 50 ఏళ్ళు

Super Star Krishna And Rebel Star Krishnam Raju Amma Kosam Completes 50 Decades

సూప‌ర్ స్టార్ కృష్ణ‌, రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు కాంబినేష‌న్‌లో ప‌లు మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ తెర‌కెక్కాయి. వాటిలో ‘అమ్మ‌కోసం’ ఒక‌టి. బి.వి.ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో… విజ‌యనిర్మ‌ల‌, బాలీవుడ్ నటి రేఖ క‌థానాయిక‌లుగా న‌టించారు. అంజ‌లీదేవి, గుమ్మ‌డి వెంక‌టేశ్వ‌ర‌రావు, నాగ‌భూష‌ణం ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. బి.వి.ప్ర‌సాద్ క‌థ‌కు… ఆచార్య ఆత్రేయ మాట‌లు అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సి.నారాయ‌ణ‌రెడ్డి, ఆరుద్ర గీత ర‌చ‌న చేయ‌గా… ఆదినారాయ‌ణ‌రావ్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. “గువ్వ‌లా ఎగిరిపోవాలి”, “అదే అదే ప‌దే”, “రేపు వ‌త్తువుగాని”, “పాపి కొండ‌ల‌”, “పొంచిన వంచ‌న‌” వంటి గీతాలు అప్ప‌ట్లో జ‌నాద‌ర‌ణ పొందాయి. అంజ‌లీదేవి స‌మ‌ర్ప‌ణలో రూపొందిన ఈ చిత్రాన్ని చిన్నీ బ్ర‌ద‌ర్స్ ప‌తాకంపై చిన్నారావ్ నిర్మించారు. 1970 మార్చి 26న విడుద‌లైన ‘అమ్మ‌కోసం’… నేటితో ఐదు ద‌శాబ్దాలు పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + 12 =