`ఆచార్య‌`.. రామ్ చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్ డిటైల్స్

Ram Charan Character Details In Acharya Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ram Charan,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Movie Updates,Acharya Telugu Movie Latest News,Acharya Movie Live News,Ram Charan Role In Acharya Telugu Movie,#Acharya

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య‌’. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న ఈ సోష‌ల్ డ్రామాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. అంతేకాదు… ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా ఓ కీల‌క పాత్ర పోషించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. కాగా, చ‌ర‌ణ్ పాత్ర‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… ఈ సినిమాలో చ‌ర‌ణ్ క్యారెక్ట‌ర్‌ దాదాపు 30 నిమిషాలు పాటు ఉంటుంద‌ని స‌మాచారం. చ‌ర‌ణ్ మాజీ న‌క్స‌లైట్‌గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడ‌ని… స‌మాజానికి మంచి చేసే ప్ర‌య‌త్నంలో ఆ పాత్ర చ‌నిపోతుంద‌ని… ఆ పాత్ర స్పూర్తితోనే చిరు పాత్ర తాలూకు గ‌మ‌నం కూడా ఉంటుంద‌ని వినికిడి. అలాగే, చ‌ర‌ణ్‌పై ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను కూడా చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. చిరు, చ‌ర‌ణ్ క‌ల‌సి ఓ పాట‌లో స్టెప్స్ కూడా వేయ‌నున్నార‌ని… సినిమాకు అదే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని టాక్. కాగా, ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రీక‌ర‌ణ‌ పూర్తి కాగానే చ‌ర‌ణ్.. ‘ఆచార్య’ షూటింగ్ లో పాల్గొంటాడ‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్ ఎంట్రీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 1 =