‘RRR’ – పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెట్టిన రాజమౌళి

SS Rajamouli Begins RRR Post Production Work

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది. ఇంకా కొద్దిరోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది అనుకునే లోపు కరోనా వల్ల మరో పెద్ద బ్రేక్ వచ్చింది. అందరూ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నారు. కానీ రాజమౌళి మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను మొదలుపెట్టిసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ షూట్ చేసిన సీన్స్ ను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటిలోని ఎడిటింగ్ షూట్ లోనే ఎడిట్ చేస్తున్నారట. అంతేకాదు అవుట్ పుట్ చూసి రాజమౌళి పూర్తి సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.