చిరు ఫస్ట్ పోస్ట్ – ‘ఆచార్య’ ఫస్ట్ లుక్..!

Megastar Chiranjeevi To Release Acharya Movie First Look Through His Social Media Handles

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం నటిస్తోన్న సినిమా ఆచార్య. మెగా స్టార్, అందులోను కొరటాల డైరెక్షన్ కావడంతో సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కమర్షియల్ ఎలిమేట్స్ తో సామజిక అంశాలను మేళవించి చూపించడంలో కొరటాల దిట్ట. ఇక ఈ సినిమా టైటిల్ ను ఇటీవలే ఓ పిట్ట కథ ఆడియో వేడుకలో చిరంజీవి అనుకోకుండా రివీల్ చేయడంతో సస్పెన్స్ వీడిపోయింది. ఇక ఫస్ట్ లుక్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. హోలీకి ఈ చిత్రానికి సంబంధించిన ఏదొక విశేషముంటుందని అనుకున్నారు కానీ అలాంటిదేం జరగలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తాను కూడా సోషల్ మీడియాలో ఎంటర్ అవ్వబోతున్నట్టు ఈ రోజు ఉదయమే చిరు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తన భావాలను, సందేశాలను తన అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్స్ ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. చెప్పినట్టే అప్పుడే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ను తెరిచారు. అలా తెరిచారో లేదో అప్పుడే లక్షల్లో ఫాలోవర్స్ వచ్చేసారు. ఇక తాజా సమాచారం ప్రకారం రేపు ఉగాది పండుగ సందర్భంగా…ఫస్ట్ పోస్ట్ గా ఆచార్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. చూద్దాం మరి రేపు ఏం జరుగుతుందో..

కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై రామ్ చ‌ర‌ణ్, నిరంజ‌న్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ .. త్వ‌ర‌లోనే త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభించ‌నుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =