స్టార్ హీరోయిన్స్ తెర మీద ఫిట్ , స్ట్రాంగ్, నాజూకుగా కనపడడానికి శాకాహారులుగా మారుతున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ వేగన్ గా మారిన తరువాత ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా వేగన్ గా మారారు. తమన్నా శాకాహారి గా మారిన తరువాత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమన్నా ప్రస్తతం శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీమార్” మూవీ లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు. కబడ్డీ , తెలంగాణ యాస భాష లో తమన్నా శిక్షణ పొందారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ .. క్రీడా నేపథ్య మూవీ లో నటించాలనే కోరిక “సీటీమార్” మూవీ తో నెరవేరబోతోందని , డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నటించాలనే కల ఒక్కటి మిగిలిపోయిందని తమన్నా చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























