టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ మూవీస్ హవా నడుస్తుంది. ఇతర భాషలలో సక్సెస్ అయిన మూవీస్ ను తెలుగు లో రీమేక్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “మోసగాళ్ళు “, “ఇండియన్ 2”, “ముంబై సాగా ” మూవీస్ లో నటిస్తున్నారు. ఇప్పుడు ఒక కొరియన్ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2012 సంవత్సరంలో కొరియన్ మూవీ “డ్యాన్సింగ్ క్వీన్ ” మూవీ ఘనవిజయం సాధించింది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో ఆ మూవీ రీమేక్ కానుంది. ఒక పెళ్ళైన జంట తమ కలలను ఎలా సాకారం చేసుకున్నారనే కథ తో రూపొందే ఈ మూవీ లో కామెడీ హీరో అల్లరి నరేష్ కథానాయకుడు గా నటిస్తారని వార్తలు వస్తున్నాయి.




ఈ మూవీ కి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ “క్వీన్ ” తమిళ రీమేక్ లో నటించిన కాజల్ , సూపర్ హిట్ కొరియన్ మూవీ “డ్యాన్సింగ్ క్వీన్” తెలుగు రీమేక్ లో నటించడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: