డెబ్యూ డైరెక్ట‌ర్ తో రామ్ చ‌ర‌ణ్‌?

Ram Charan Join Hands With Debut Movie Director

క‌థానాయ‌కుడిగా మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ది 13 ఏళ్ళ న‌ట‌నాప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో 12 చిత్రాల‌లో హీరోగా సంద‌డి చేశాడు. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్`.. త‌న 13వ సినిమా. ఆస‌క్తిక‌ర‌మైన ఏమిటంటే… తొలి చిత్రం `చిరుత‌` నుండి తాజా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` వ‌ర‌కు అనుభ‌వ‌మున్న ద‌ర్శ‌కుల‌తోనే ప‌నిచేశాడు చ‌ర‌ణ్. అయితే.. `ఆర్ ఆర్ ఆర్` త‌రువాత ప‌ట్టాలెక్క‌నున్న త‌న 14వ చిత్రం మాత్రం ఒక డెబ్యూ డైరెక్ట‌ర్ తో చేయ‌బోతున్నాడ‌ట మెగాప‌వ‌ర్ స్టార్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌ల ప్ర‌దీప్ అనే యువ‌కుడు చ‌ర‌ణ్ ని సంప్ర‌దించి ఓ ఇన్నోవేటివ్ స్టోరీ లైన్ చెప్పాడ‌ట‌. చ‌ర‌ణ్ తో పాటు మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ లైన్ బాగా న‌చ్చింద‌ట‌. అందుకే వెంట‌నే ఇద్ద‌రు కూడా స‌ద‌రు న్యూ టాలెంట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి… నూత‌న ద‌ర్శ‌కుడితో తొలి సారి ప‌నిచేయ‌నున్న చ‌ర‌ణ్.. ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాడో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.