మీ డ్రీమ్ ప్రాజెక్ట్ నిజమైంది సార్..!

స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘మరక్కార్ – అరబికడలింతే సింహం’. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి మరక్కర్‌ అనే నావికుడి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో వున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రొమోషన్ కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలాఉండగా ఈ సినిమా ట్రయిలర్ కు సూపర్ స్టార్ మహేష్ తన ట్విట్టర్ ద్వారా స్పందించి చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు. మీ కల నిజమైంది… అల్ ద బెస్ట్ మోహన్ లాల్ సార్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.


ఇక హిందీలో అక్షయ్ కుమార్, తమిళ్ లో సూర్య, కన్నడలో యష్, మళయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. కాగా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోహన్ లాల్ తో పాటు ఇంకా ఈ సినిమాలో ఇంకా ఈ సినిమాలో అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్‌ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్‌, ప్రభు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈనెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − two =