చెందు ముద్దు దర్శకత్వంలో సంజయ్ రావు, విశ్వంత్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా “ఓ పిట్టకథ”. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు మొదటి నుండి ఇండస్ట్రీలోని పలువురి ప్రముఖుల సపోర్ట్ లభిస్తూనే ఉంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రీ రిలీజ్ కు మెగా స్టార్ రాగా.. నిన్న ప్రభాస్ కూడా టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్తూ ట్వీట్ చేశాడు. ఇక ఇప్పుడు మరో హీరో ఈ ఖాతాలో చేరాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకి టీమ్ కి విష్ చేస్తూ ట్వీట్ చేశారు. సంజయ్ అండ్ నా ఫ్రెండ్ బ్రహ్మాజీకి అలాగే ‘ఓ పిట్టకథ’ చిత్రబృందానికి బెస్ట్ విషెస్.. రేపే ఈ సినిమా విడుదల అవుతుంది’ అని పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Best wishes to Sanjay, my friend @actorbrahmaji and the entire team of #OPittaKatha for the release tomorrow
— Jr NTR (@tarak9999) March 5, 2020



ఇంకా ఈ చిత్రంలో, శ్రీనివాస్ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనందప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతమందిస్తున్నాడు. మరి టీజర్, ట్రయిలర్,పాటలతో సినిమాపై అంచనాలు పెంచారు.. ఆ అంచనాలను ఎంత వరకూ రీచ్ అవుతారో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























