‘కరోనా’ తో రవిబాబు ‘క్రష్’ ప్రమోషన్స్

Creative Director Ravi Babu Makes The Best Use Of Corona Trend For His New Movie Promotion

ప్రస్తుతం ఎక్కువగా వినిపించే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ‘కరోనా వైరస్’ గురించే. ఇక ఇప్పుడు దీనిని సినిమా ప్రమోషన్స్ కు కూడా వాడుకుంటున్నాడు ఓ డైరెక్టర్. దీనిని కూడా ప్రమోషన్స్ కు వాడిన ఆ డైరెక్టర్ ఎవరనే కదా మీ డౌట్. ఇంకెవరూ.. టాలీవుడ్ లో ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. ఫలితాలతో సంబంధం లేకుండా, ప్రయోగాలను వదిలిపెట్టకుండా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ చిత్రాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ రవిబాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఆవిరి’ సినిమా తర్వాత రవిబాబు తాజాగా చేస్తున్న చిత్రం ‘క్రష్‌’. సైలెంట్ గా ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టాడు. దీనిలో భాగంగా చిత్రానికి సంబంధించిన మరో రెండు పోస్టర్లను మూవీ యూనిట్‌ విడుదల చేసింది. మరి రవిబాబు ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేస్తాడు. అలానే ఇప్పుడు కూడా ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ‘కరోనా వైరస్‌’ అడ్డుకట్ట వేయడానికి మాస్క్‌లు ధరించాలంటూ సూచిస్తూ వినూత్న ఫోటోలను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని పనులు త్వరలో పూర్తి చేసి సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 10 =