ఎన్టీఆర్ తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు… ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అదే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ముగిసిన తర్వాత ఎన్టీఆర్ ఏ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడో అనే దానిపై పలు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ పేర్లు వినిపించాయి. అంతేకాదు ఎన్టీఆర్ ఎవరితో చేస్తే బావుంటది అన్న పోల్స్ కూడా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలన్నిటికీ బ్రేక్ పడింది. ఫైనల్ గా ఎన్టీఆర్ తర్వాత సినిమా ఎవరితో ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేసారు. మరోసారి త్రివిక్రమ్ తోనే ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. త్రివిక్రమ్ దర్శకత్వంలో… ఎన్టీఆర్ హీరోగా హారిక అండ్ హాసిని మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధా కృష్ణ, కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన అరవింద సామెత సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాషూట్ లో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: