భీష్మ నుండి ‘సూపర్ క్యూట్’ వీడియో సాంగ్ రిలీజ్

Bheeshma Super Cute Video Song,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Super Cute Video Song,Super Cute Song,Bheeshma songs,Bheeshma Movie Songs,Bheeshma Telugu Movie Songs,Bheeshma Video Songs

తన మొదటి సినిమా ‘ఛలో’ తోనే సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల తన రెండో సినిమా నితిన్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ‘భీష్మ’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యాక్రమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. ఇక ‘సింగిల్ యాంథెమ్’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ పాట సింగిల్స్ కు మాత్రం బాగా ఎక్కిందని చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ‘వాటే బ్యూటీ’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. “నీ నవ్వేమో సూపర్ క్యూటే .. నీ వైటు చున్నీ సూపర్ క్యూటే .. ఓ లుక్కుతోటి పెంచావే నాలో హార్టు బీటే ..” అంటూ ఈ పాట సాగుతోంది. నితిన్ – రష్మికలపై విదేశాల్లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకునేలా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కాగా రష్మికా మందన్న కథానాయికగా నటిస్తుండగా… హెబ్బా పటేల్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. హెబ్బా పటేల్ పాత్ర నెగిటివ్ షేడ్స్ తో ఉంటుందని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. మ‌హ‌తి సాగ‌ర్ సంగీత‌మందిస్తున్నాడు. ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =