“వాలెంటైన్స్ డే ” స్పెషల్

Valentine's Day Special Movies

రెండు అక్షరాల “ప్రేమ” అనిర్వచనీయం. రెండు హృదయాల స్పందనే ప్రేమ. ప్రేమించడం , ప్రేమించబడటం ఒక మధురానుభూతి. చిల్డ్రన్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, కార్మికులకు మే డే ఉన్నట్టు గానే ప్రేమికులకు “వాలెంటైన్స్ డే ” ఉంది. ప్రేమికులు ఒకరిపట్ల ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్త పరచుకొనే రోజే “వాలెంటైన్స్ డే “. ప్రతీ సంవత్సరం ప్రజలు సంక్రాంతి, దసరా, దీపావళి పండగలు జరుపుకున్నట్టే ప్రేమికులు ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 14 వ తేదీ “వాలెంటైన్స్ డే ” పండగ జరుపుకుంటారు.

[custom_ad]

చలన చిత్ర సీమలో ఏ భాషలోనైనా ప్రేమకథలకు ప్రేక్షకాదరణ ఎప్పుడూ ఉంది. అలనాటి “దేవదాసు”, “ప్రేమ్ నగర్”, ఒక జన్మలో పుట్టిన ప్రేమ మరు జన్మ లో కూడా వెన్నంటి ఉంటుందని నిరూపించిన “మగధీర”, టీనేజ్ ప్రేమ కథాచిత్రాలు “జయం”, “కొత్త బంగారు లోకం”, “నువ్వే కావాలి”, ” నువ్వొస్తానంటే నేనొద్దంటానా”వంటి మూవీస్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన”జాను ” మూవీ ఘనవిజయం సాధించింది. ప్రేమ అనేది ఆకర్షణ అని పెద్దలు తీసిపారేసినా కులాంతర, మతాంతర ప్రేమ వివాహం చేసుకున్న పలు జంటలు సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే. ప్రేమకు ఆ మహత్తు ఉంది. ప్రేమ అనేది అజరామరం. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ప్రేమికులకు అడ్డే లేదు. ఒక్క కన్నుగీటు తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి, ఇంటర్ నెట్ సెన్సేషన్ గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన “లవర్స్ డే” మూవీ 2019 సంవత్సరం “వాలెంటైన్స్ డే” కు రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ సంవత్సరం “వాలెంటైన్స్ డే ” కానుకగా సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14 వ తేదీ రిలీజ్ కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here