బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ప్రధాన పాత్రలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసింది. ఇప్పుడు తాజాగా మరో కొత్త అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో అప్డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. రేపు ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కావడంతో ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి పూజా హెగ్డే లుక్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లరెట్ ‘విభా’ అంటూ ఆమె పాత్రను పరిచయం చేస్తూ, రేపు సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకి ఫస్టులుక్ ను విడుదల చేయనున్నట్టు తెలిపారు.
[custom_ad]
కాగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను అఖిల్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి చూద్దాం ఈ సినిమాతో అయినా అఖిల్ మంచి బ్లాక్ బస్టర్ అందుకుంటాడో..? లేదో..?
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: