పసుపులేటి రామారావు మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు – మోహన్ బాబు ఎం

Journalist Pasupuleti Rama Rao, Latest Telugu Movies News, Pasupuleti Rama Rao, Pasupuleti Rama Rao Demise Is A Personal Loss To Me Says Mohan Babu, Pasupuleti Rama Rao Latest News, Pasupuleti Rama Rao Passes Away, Pasupuleti Rama Rao Rest In Peace, Senior Journalist Pasupuleti Rama Rao, Senior Journalist Pasupuleti Rama Rao Demise, Senior Journalist Pasupuleti Rama Rao Is No More, Senior Journalist Pasupuleti Rama Rao Passed Away, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

“నాకు సన్నిహితుడైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు గారి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను నటుడిగా పరిచయమైనప్పటుంచీ ఆయనతో నాకు స్నేహం ఉంది. మద్రాసులో ఎంత సన్నిహితంగా ఉన్నామో, హైదరాబాద్ కు వచ్చాక కూడా అదే సానిహిత్యం మా మధ్య కొనసాగింది. అప్పుడూ, ఇప్పుడూ తెల్లటి దుస్తులు, భుజాన కాటన్ సంచీ.. ఇదే ఆయన ఆహార్యం. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఆయన పేరు తెచ్చుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఎన్నోసార్లు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూల్లో తనకు కావాల్సిన ఎన్నో విషయాలు రాబట్టుకొనేవారు. సినిమా జర్నలిస్టుగా చిత్రసీమకు ఆయనెంతో సేవచేశారు. ఒక తరం సినీ జర్నలిస్టులకు మార్గదర్శిగా నిలిచిన ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.”

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seventeen =