మార్చిలో కీర్తి సురేష్ డ‌బుల్ ధ‌మాకా

Keerthy Suresh To Give Double Dhamaka In March 2020

2018లో `మ‌హాన‌టి`గా మురిపించిన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్.. గ‌త ఏడాది `మ‌న్మ‌థుడు 2`లో అతిథి పాత్ర‌కే ప‌రిమిత‌మైంది. అయితే, 2020లో మాత్రం వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. దాదాపు అర‌డ‌జ‌ను సినిమాల‌తో ఈ టాలెంటెడ్ బ్యూటీ సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎంట‌ర్ టైన్ చేయ‌నుంది. అంతేకాదు.. ఒక్క మార్చి నెల‌లోనే రెండు చిత్రాల‌తో మురిపించ‌నుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆ వివరాల్లోకి వెళితే.. కీర్తి టైటిల్ రోల్ లో న‌టించిన ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ `మిస్ ఇండియా` మార్చి 6న రిలీజ్ కానుండ‌గా.. మార్చి 26న పాన్ – ఇండియా ప్రాజెక్ట్ అయిన మ‌ల‌యాళ చిత్రం `మ‌రక్క‌ర్ అర‌బిక్ క‌డ‌లింటే సింహం`(మోహ‌న్ లాల్ ప్ర‌ధాన పాత్ర‌ధారి) విడుద‌ల కానుంది. అంటే.. మూడు వారాల గ్యాప్ లో కీర్తి డ‌బుల్ ధ‌మాకా ఇవ్వ‌నుందన్న‌మాట‌.

[custom_ad]

ఇక ఇదే ఏడాదిలో కీర్తి న‌టించిన `రంగ్ దే`, `పెంగ్విన్`, `గుడ్ ల‌క్ స‌ఖి`తో పాటు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ తో క‌ల‌సి న‌టిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రం కూడా రాబోతోంది. మ‌రి.. ఈ సినిమాల‌తో న‌టిగా కీర్తి స్థాయి మ‌రింతగా పెరుగుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.