ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటీమణుల్లో భూమికా చావ్లా ఒకరు. ఒకటిన్నర దశాబ్దం క్రితం అగ్ర కథానాయికగా చెలామణి అయిన ఈ నటీమణి.. ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ లో అలరిస్తోంది. ఇటీవల `ఎంసీఏ`, `యూ టర్న్`, `సవ్యసాచి`, `రూలర్` వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో దర్శనమిచ్చిన భూమిక.. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ కొత్త చిత్రం `సీటీమార్`లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
తాజా కథనాల ప్రకారం.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో గోపీచంద్ కి అక్కగా భూమిక దర్శనమిస్తుందని తెలిసింది. కథను కీలక మలుపు తిప్పే పాత్ర ఇదని.. భూమికకి నటిగా మరింత గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందని ఇన్ సైడ్ ఇన్ ఫర్మేషన్. మరి.. ఈ `సీటీమార్` భూమిక కెరీర్ కి ఏ మేరకు ప్లస్ అవుతుందో తెలియాలంటే వేసవి వరకు వేచిచూడాల్సిందే.
సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న `సీటీమార్`లో గోపీచంద్ కి జోడీగా తమన్నా నటిస్తోంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: