డిస్కో రాజా మూవీ రివ్యూ

Disco Raja Movie Review

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ ‘డిస్కోరాజా’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ నుండే సినిమాపై క్యూరియాసిటీ పెంచారు చిత్రయూనిట్. అంతేకాదు టీజర్, ట్రయిలర్ లతో కూడా అంచనాలు పెంచేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది..?ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయ్యిందా? రవితేజకు మంచి కమ్ బ్యాక్ ఫిలిం అవుతుందా..? లేదా? ఈ విషయాలన్నీ తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

[custom_ad]

నటీనటులు – రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్, బాబీ సింహా, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు..
డైరెక్టర్ – విఐ ఆనంద్
బ్యానర్ – ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్
నిర్మాత – రామ్ తాళ్లూరి
సినిమాటోగ్రఫీ – కార్తిక్ ఘట్టమనేని
సంగీతం – థమన్

కథ:

వాసు (రవితేజ) ఒక అనాథ. అయితే అనుకోని పరిస్థితుల్లో వాసు చనిపోతాడు. ఆయన కోసం ఢిల్లీలో ఆయన కుటుంబం అంతా వెతుకుతున్న తరుణంలో వాసు డెడ్ బాడీని డాక్టర్ పరిణీతి (తాన్యా హోప్) బృందం ల్యాబ్‌కు తెప్పించుకుంటారు. ఈ శవాన్ని ఒక పెద్ద బయోటెక్ కంపెనీ బయట ప్రపంచానికి తెలియకుండా తీసుకెళ్లిపోతుంది. చనిపోయిన వ్యక్తిని బతికించే పరిశోధనలు చేస్తోన్న ఈ కంపెనీ.. చట్ట విరుద్ధంగా తమ ప్రయోగానికి ఈ శవాన్ని వాడుకుంటుంది. ఈ ప్రయోగం ఫలిస్తుంది. కానీ వాసు గతం మర్చిపోతాడు. తన గతాన్ని తెలుసుకొనే ప్రయత్నంలో మద్రాస్ వెళ్తాడు. అక్కడ డిస్కో రాజా(రవితేజ) గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు. అసలు వాసు, డిస్కో రాజాకు ఏంటి సంబంధం.. వాసును ఎందుకు చంపేస్తారు.. డిస్కో రాజా ఎలా చచ్చిపోతాడు అనేది అసలు కథ..

[custom_ad]

విశ్లేషణ:

రివేంజ్ డ్రామాను ఇప్పటికే చాలా సినిమాల్లో చూసుంటాం. విలన్ వల్ల హీరో నష్టపోవడం.. హీరో రివేంజ్ తీర్చుకోవడం. ఇక ఈ సినిమా కూడా అదే ఫార్ములాతో తెరకెక్కింది. అయితే దానినే కొత్తగా చూపెట్టే ప్రయత్నం చేశాడు ఆనంద్. సినిమా స్టార్ట్ అయిన కొంత సేపటికే హీరో చనిపోవడం.. చనిపోయిన మనిషిని మళ్లీ బతికించడం.. బతికిన హీరో గతం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం ఇదే నడుస్తూ ఉంటుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లారు దర్శకుడు. డిస్కో రాజాతో తనకేంటి సంబంధం అని తెలుసుకునే క్రమంలో వాసుకు ఆసక్తికరమైన విషయాలు తెలియడం.. అప్పుడు అసలు ట్విస్ట్ బయటికి రావడం ప్రేక్షకులకు షాక్ ఇస్తాయి. అక్కడి నుంచి ప్రేక్షకుడికి ఒక క్లారిటీ వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిపోతుంది.

[custom_ad]

ఇక సెకండాఫ్ చాలా వరకు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌తో నడుస్తుంది. ఓ దొంగ.. డాన్ అవ్వడం.. అతడికి మరో డాన్ బాబీ సింహాతో గొడవ.. హీరో విలన్‌ను చిత్తు చేయడం అవన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. అయితే 80స్ బ్యాక్ డ్రాప్ సన్నివేశాలు బాగానే రాసుకున్నాడు దర్శకుడు. రవితేజ, బాబీ సింహా మధ్య వచ్చే సీన్లు బాగుంటాయి. క్లైమాక్స్‌లో మాత్రం మంచి ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు.బాబీ సింహాను చంపిన తర్వాత వచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోతుంది. ఆ ట్విస్ట్ ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

దాదాపు రెండేళ్ళ తర్వాత మాస్ మహారాజ రవితేజ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమర్ అక్బర్ ఆంటోని సినిమా తర్వాత రవి తేజా మళ్ళీ సినిమా చేయలేదు. ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమాతో రవి తేజా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాతో రవితేజ మంచి ప్రయోగమే చేసాడు. ఇక రవితేజ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఎనర్జీ తోనే సినిమాను నడింపించేయగల నటుడు. ఈ సినిమాలో కూడా అదే ఎనర్జీని చూపించాడు. రవితేజలోని ఫైర్‌ను మరోసారి మనం తెరపై చూడొచ్చు.

[custom_ad]

హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదనే చెప్పొచ్చు. నభా నటేష్ తన గ్లామర్ తో ఆకట్టుకుంటే.. పాయల్ రాజ్‌పుత్ మూగ అమ్మాయిగా చక్కగా నటించి తన అభినయంతో ఆకట్టుకుంది. ఇక తాన్య హోప్ డాక్టర్ పాత్రలో మెప్పించింది.

ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర బాబి సింహది. కొంత తమ ముఖంతోనే నటనను పండించేస్తారు. అలాంటివారిలో బాబి సింహ కూడా ఉంటాడు. స్క్రీన్ పై తెలియని మ్యాజిక్ చేస్తాడు సింహా. అదే మ్యాజిక్ ఈ సినిమాలో కూడా చూపించాడు. ఇక సునీల్ కామెడి ఈ సినిమాకుమరో ప్రధానంగా హైలెట్ గా నిలిచింది. రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో బాగా నటించాడు. వెన్నెల కిషోర్‌ కూడా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు వీకే నరేష్, సత్య, సత్యం రాజేష్, రాంకీ, అన్నపూర్ణ, గిరిబాబు, రఘుబాబు, శిశిర్ శర్మ తమ పాత్రల పరిధి మేర నటించారు.

[custom_ad]

తమన్ సంగీతం బాగుంది. ముఖ్యంగా ఆర్ఆర్.. సినిమా రేంజ్ పెంచేసింది ఈ బ్యాగ్రౌండ్ స్కోర్. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ముఖ్యంగా లదాఖ్‌లా చూపించిన ఐస్‌ల్యాండ్‌లోని మంచు కొండలను తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. ఎడిటింగ్ పర్లేదు. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ లో అది కనిపిస్తుంది. ఆర్ట్ డైరెక్టర్ టి నాగేంద్ర ప్రసాద్ వర్క్ బాగుంది. 30 ఏళ్ల కింద ఉండే ఫీల్ మళ్లీ తన ఆర్ట్ వర్క్‌తో చూపించాడు.

ఓవరాల్ గా ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

[custom_ad]

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here