యు వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా ఒక సరి కొత్త ప్రేమ కథ #Prabhas20 మూవీగా రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ “మైనే ప్యార్ కియా “తో దేశ వ్యాప్తం గా గుర్తింపు పొందిన భాగ్యశ్రీ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
#Prabhas20 మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో రూపొందించిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రభాస్, భాగ్యశ్రీ లపై దర్శకుడు రాధాకృష్ణ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ మీడియా తో సమావేశం అయ్యారు. భాగ్యశ్రీ మాట్లాడుతూ .. #Prabhas20 మూవీ లో ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నానని, ఈ మూవీ లో తన పాత్ర కీలకంగా ఉంటుందని, సెట్ భూలోక స్వర్గం లా ఉందని, #Prabhas20 మూవీ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుందని, ప్రభాస్ నైస్ పర్సన్ అని ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. చాలా కాలం తరువాత తెలుగు మూవీ లో నటిస్తున్నందుకు ఎగ్జైటింగ్ గా ఉందన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: