’83’ తెలుగులో ‘నాగార్జున’ తమిళ్ లో కమల్

కబీర్ సింగ్ దర్శకత్వంలో.. రన్‌వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను ‘‘83’’ అనే పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కపిల్ దేవ్ జీవితం,1983 ప్రపంచకప్ విజయం తదితర అంశాల ఆధారంగా సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను.. రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మధు మంటేన, సాజిద్ నడియావాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10, 2020న విడుదలకానున్న ఈ సినిమాలో రన్‌వీర్ సతీమణి దీపిక క‌పిల్‌దేవ్ భార్య రోమీ పాత్ర‌లో నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను తెలుగులో తమిళ్ లో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. తెలుగులో రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ‌తో క‌లిసి అన్న‌పూర్ణ స్టూడియోస్ ద్వారా అక్కినేని నాగార్జున రిలీజ్ చేయనున్నారు. ఇక తమిళ్ లో కమల్ హాసన్ రిలీజ్ చేయనున్నారు.

[custom_ad]

ఈ సంద‌ర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “క్రికెట్ జ‌గ‌త్తులో 1983లో మ‌న దేశం గొప్ప విజ‌యాన్ని సాధించింది. ఈ విజయంతో మ‌న దేశంలో క్రికెట్ ఓ మతం అనేంత గొప్ప‌గా మ‌మేక‌మైంది. ఈ ప్ర‌యాణం గురించి చెప్పే చిత్ర‌మే `83`. ఈ జ‌ర్నీ గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. క్రికెట్ ప్ర‌పంచంలో విశ్వ‌విజేత ఉన్న వెస్టిండీస్ జ‌ట్టును ఓడించి భార‌తదేశం తొలిసారి క్రికెట్ ప్ర‌పంచ క‌ప్‌ను గెలుచుకుంది. ఈ సినిమాను తెలుగులో మా సంస్థ ద్వారా విడుద‌ల చేస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది“ అన్నారు.

ద‌ర్శ‌కుడు క‌బీర్‌ఖాన్ మాట్లాడుతూ – “ఓ ఫిలిం మేక‌ర్‌గా నాగార్జున‌గారంటే నాకు ఎంతో గౌర‌వం. మా సినిమాను అంత గొప్ప వ్య‌క్తి స‌హాకారంతో తెలుగులో విడుద‌ల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. `83` చిత్రం త‌ప్ప‌కుండా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది“ అన్నారు.

[custom_ad]

రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాసిస్ సర్కార్ మాట్లాడుతూ “83 సినిమాను అన్న‌పూర్ణ స్టూడియో సంస్థ‌తో క‌లిసి విడుద‌ల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అక్కినేని నాగార్జున‌గారితో క‌లిసి ఈ సినిమాను విడుద‌ల చేయ‌డం హ్యాపీ. ఆయ‌న స‌పోర్ట్‌తో ఈ సినిమా రీచ్ బాగా ఉంటుంద‌న‌డంలో సందేహ‌మే లేదు. `83` మూవీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. పాన్ ఇండియా లెవ‌ల్లో సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం“ అన్నారు. గ్లోబ‌ల్ సినిమా ఈ సినిమాను నైజాం ఏరియాలో విడుద‌ల చేస్తున్నారు.

ఈ చిత్రంలో క‌పిల్‌దేవ్‌లా ర‌ణ‌వీర్ సింగ్, సునీల్ గ‌వాస్క‌ర్‌లా తాహిర్ రాజ్ బాసిన్, మ‌ద‌న్‌లాల్‌గా హార్డీ సంధు, మ‌హీంద‌ర్ అమ‌ర్‌నాథ్‌గా ష‌కీబ్ స‌లీమ్‌, బ‌ల్వీంద‌ర్ సింగ్ సంధుగా అమ్మీ విర్క్‌, కృష్ణ‌మాచారి శ్రీకాంత్‌గా జీవా, సందీప్ పాటిల్‌గా చిరాగ్ పాటిల్‌, స‌య్య‌ద్ కిర్మాణిగా సాహిల్‌ క‌త్తార్‌, దిలీప్ వెంగ్‌స‌ర్కార్‌గా అదినాథ్ కొతారి, ర‌విశాస్త్రి ధైర్య కార్వా, కృతి ఆజాద్‌గా దినేక‌ర్ శ‌ర్మ‌, య‌శ్‌పాల్ శ‌ర్మ‌గా జ‌తిన్ శ‌ర్నా, రోజ‌ర్ బ‌న్నిగా నిశాంత్ ద‌హియా, సునీల్ వాల్సన్‌గా ఆర్‌.బద్రి, ఫ‌రూక్ ఇంజ‌నీర్‌గా బోమ‌న్ ఇరాని, పి.ఆర్‌.మ‌న్‌సింగ్‌గా పంక‌జ్ త్రిపాఠిగా న‌టిస్తున్నారు.

[custom_ad]

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × four =