`స‌రిలేరు నీకెవ్వ‌రు`.. కొన్ని రికార్డులు

Sarileru Neekevvaru Movie Sets New Records At Box Office

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీసెంట్ సెన్సేష‌న్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. సంక్రాంతి కానుక‌గా విడుద‌లై క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ సినిమాతో కొన్ని రికార్డులు న‌మోదయ్యాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

1. నూత‌న‌ ద‌శాబ్దంలో తెలుగునాట తొలి స‌క్సెస్ ఫుల్ మూవీగా `స‌రిలేరు నీకెవ్వ‌రు`కి అరుదైన రికార్డు ద‌క్కింది.
2. అలాగే ఈ ఏడాది తెలుగునాట రూ.100 కోట్ల గ్రాస్ చూసిన మొద‌టి చిత్రంగా అరుదైన రికార్డును వ‌శం చేసుకుంది.
3. `భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి` త‌రువాత మ‌హేష్ బాబు ఖాతాలో హ్యాట్రిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా `స‌రిలేరు నీకెవ్వ‌రు` రికార్డుల‌కెక్కింది.

[custom_ad]

4. అదే విధంగా మ‌హేష్ కెరీర్ లో మూడో రూ.100 కోట్ల షేర్ ఫిల్మ్ గా `స‌రిలేరు నీకెవ్వ‌రు` నిల‌చింది.
5. ఓవ‌ర్సీస్ `1 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్` జాబితాలో చేరిన మ‌హేష్ బాబు ప‌దో చిత్ర‌మిది. `దూకుడు`తో మొద‌లైన ఈ ప్ర‌స్థానం.. అలాగే కొన‌సాగుతుండ‌డం విశేషం.
6. ఇక `2 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్`లో స్థానం ద‌క్కించుకున్న మ‌హేష్ బాబు మూడో సినిమా ఇది. ఇప్ప‌టికే ఈ క్ల‌బ్ లో `భ‌రత్ అనే నేను`, `మ‌హ‌ర్షి` చిత్రాలు ఉన్నాయి.

[custom_ad]

మ‌రి… ఫుల్ ర‌న్ లో `స‌రిలేరు నీకెవ్వ‌రు` పేరిట ఇంకెన్ని రికార్డులు వ‌శ‌మ‌వుతాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − ten =