బాక్సాఫీస్ వద్ద రామాయణం సునామీ: ఐదో రోజు 126 కోట్ల గ్రాస్‌తో సరికొత్త చరిత్ర
Ramayana Sets a New Record with ₹126 Crore Gross on Its Fifth Day

భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రామాయణం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విడుదలై ఐదు రోజులు పూర్తయ్యే సరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 663 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఐదో రోజు భారతదేశంలోనే ఏకంగా రూ. 126 కోట్ల (₹126Cr+) గ్రాస్ సాధించి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఒక భారతీయ చిత్రానికి భారతదేశంలో ఐదో రోజు ఈ స్థాయిలో అత్యధిక వసూళ్లు రావడం మరియు నిన్న అతిపెద్ద సింగిల్ డే కలెక్షన్‌గా నిలవడం సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు.
దీపావళి పండుగ ముగిసిన మరుసటి రోజు (సోమవారం) సాధారణంగా కలెక్షన్లు తగ్గుతాయని భావించినప్పటికీ, ‘రామాయణం’ చిత్రం దానికి భిన్నంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. సోమవారం ఒక్క రోజే భారతదేశంలో రూ. 126 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా రూ. 160 కోట్ల గ్రాస్ రాబట్టి తన ఆల్-టైమ్ హయ్యెస్ట్ సింగిల్ డే కలెక్షన్‌ను నమోదు చేసుకుంది.
ఇప్పటివరకు సాధించిన మొత్తంలో భారతదేశం నుండి రూ. 407 కోట్ల గ్రాస్ రాగా, ఓవర్సీస్ మార్కెట్ నుండి రూ. 256 కోట్లు లభించాయి. రణ్‌బీర్ కపూర్, యష్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ విజువల్ వండర్ సినిమా, విడుదలైన ఐదు రోజుల్లోనే రూ. 663 కోట్ల మైలురాయిని దాటడంతో ఈవారాంతంలో రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.







