కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఓ.౦ సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం రివీల్

ఓ.౦ సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం రివీల్

ఓ.౦ సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం రివీల్

O.M Clears Censor; Runtime Revealed

ఓ.౦ సెన్సార్ కంప్లీట్ .. రన్ టైం రివీల్

తమిళ కథానాయకుడు ధనుష్, మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ఓ.౦’ (ఆపరేషన్ మోల్) విడుదలకు సర్వం సిద్ధమైంది. ‘అమరన్’ వంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి కేంద్ర సెన్సార్ బోర్డు యూ/ఏ (U/A) ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది.

సెన్సార్ పూర్తయిన నేపథ్యంలో ఈ చిత్ర నిడివికి (రన్ టైమ్) సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా నిడివి ఏకంగా 179 నిమిషాలు అంటే 2 గంటల 59 నిమిషాలుగా ఖరారైంది. ప్రస్తుత కాలంలో ఇంతటి సుదీర్ఘ నిడివితో సినిమా రావడం విశేషమైనప్పటికీ, కథలో ఉన్న ఉత్కంఠభరితమైన అంశాలు, బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు కట్టిపడేస్తాయని చిత్ర బృందం పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది.

ఈ చిత్రంలో సాయి పల్లవి నిత్యా రెడ్డి అనే శక్తివంతమైన పోలీసు అధికారిణి పాత్రలో నటించగా, శ్రీలీల, రేణు దేశాయ్ ఇతర కీలక పాత్రలు పోషించారు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ కథలో దాదాపు 30 శాతానికి పైగా సంభాషణలు తెలుగులోనే ఉండటం విశేషం. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్‌టేక్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.

వీడియోస్

O.M
సినిమాO.M1 కథనాలు · సినిమా పేజీ →

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్